Advertisement

Up To The Minute News Bulletin 11-03- 2019 || ts9 news ||

Up To The Minute News Bulletin 11-03- 2019 || ts9 news || ఎన్నికల్లో పోటీ చేయను ప్రచారం మాత్రమే చేస్తానాని ప్రముఖ నటులు అలీ అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన రెడ్డి సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. అలీని వైసీపీ కండువాతో పార్టీలోనికి ఆహ్వానించారు. అయితే అలీ గతంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారన్న సంగతి తెలిసిందే. అందరికీ షాకిచ్చిన అలీ సడన్ గా వైసీపీ గూటికి చేరుతుండటం గమనార్హం. అలీ మీడియా తో మాట్లాడుతూ ‘‘జగన్ వస్తే అభివృద్ధి బాగుంటుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అయన గతంలో జగన్ ని కలిసినప్పుడు జగన్ తనని పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. మంచి మెజారిటీతో జగన్ని సీఎం గా గెలిపించడమే తన ధ్యేయ మని అలీ అన్నారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం పార్టీ తరఫున ప్రచారం చేస్తానని అలీ స్పష్టం చేశారు. ఒకవేళ జగన్ తనకు రాజమండ్రి కానీ విజయవాడ టికెట్ ఇస్తే తప్పకుండా పోటీ చేస్తానని అలీ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని ఆయన విజయవంతమైతే తాను కూడా సక్సెస్ అయినట్టే నన్నారు. స్నేహం వేరు, రాజకీయం వేరు అని అలీ స్పష్టం చేసారు. ఎలక్షన్ కోడ్ అమలు లోకి వచ్చిన సందర్భంగా పార్వతీపురం పోలీస్ లు నిఘా ముమ్మరం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతి వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎంతో ఉంత్కంఠగా సాగిన ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నికల ఫలితలు వెలువడ్డాయి. ‘మా’ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నరేష్ గెలుపొందారు. తన ప్రత్యర్థి శివాజీ రాజాపై 69 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం నమోదైన ఓట్లలో 268 ఓట్లు నరేష్‌కు పోలింగ్ రాగా శివాజీ రాజాకు 199 ఓట్లు పడ్డాయి. ఎగ్జిక్యూటీవ్ వైఎస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌పై హీరో రాజశేఖర్ విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్లుగా ఎస్వీ కృష్టారెడ్డి హేమ గెలుపొందగా జనరల్ సెక్రటరీగా రఘుబాబుపై జీవితారాజశేఖర్ విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీలుగా గౌతమ్ రాజు శివబాలాజీ గెలుపొందారు. ట్రెజరర్‌గా రాజీవ్‌ కనకాల గెలుపొందగా ‘మా’ సభ్యులుగా అలీ, రవిప్రకాశ్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వీ, జాకీ, సురేష్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సుమీర్, ఏడిద శ్రీరామ్‌, రాజా రవీంద్ర, తనీష్‌, జయలక్ష్మి, కరాటే కల్యాణి, వేణుమాధవ్‌, పసునూరి శ్రీనివాస్‌ విజయం సాధించారు.ఉత్తరాంధ్ర చర్చా వేదిక కొణతాల రామకృష్ణ అధ్యక్షతన శ్రీకాకుళంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నీళ్లు నిధులు నియామకాల్లో తీరని అన్యాయం జరుగుతోందని వెనకబడిన ప్రాంతం నుండి వలసలు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 15 నుంచి 20 శాతం నిధులను ఉత్తరాంధ్రకు కేటాయించాలని విద్య ఉపాధి తదితర రంగాల్లో స్థానికులు హక్కును కాపాడాలన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ వెంటనే ఏర్పాటు చేయాలని ఉద్దాన కిడ్నీ బాధితులను ఆదుకోవాలని అన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఉత్తరాంధ్రలో వెంటనే ప్రారంభించారులని కోరారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేపథ్యం లో ఎన్నికల ఏర్పాట్లపై వివిధ విభాగాల నోడల్ అధికారులతో హైదరాబాదు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమీషనర్ దాన కిషోర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా దంపేట్ల వద్ద రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సోలాపూర్ కు చెందిన వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొండాయిగూడెం లో కోడి పందాల కోసం వెళ్లిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. పోలీసులు కోడిపందాల స్థావరపై దాడి చేస్తున్న సమయంలో పారిపోతూ వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతిచెందాడు. గుంటూరు జిల్లా మాదినపాడు గ్రామంలో మండలపరిషత్ ప్రాధమిక పాఠశాల లో ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పాఠశాల ఆవరణలోనే తమ తోటి విద్యార్థిని పై అత్యాచారానికి పాల్పడిన ఘటన దాచేపల్లి పట్టణంలో సంచలనం కలిగించింది. పాఠాశాల గదిలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. బాలిక పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం చెందిన బాలిక బంధువులు అద్దంకి నార్కెట్ పల్లి హైవే రహదారిపై దర్నాకు దిగారు.

telugu news,vivek speech,Speech,ts9 Latest Updates,telugu news channels,live news channels,ts9 live news,ts9 news online,Telugu News,telugu news online,live tv channels,telugu news live,ts news,Telangana news,Telangana elections,telangana 2018,telangana,TS elections 2018,ts9,ts9news,tsnews,governor,telangana news,mla,cm,TS9,TS9 World,TS9 Talkies,Ts9 India,ts9 News Live Video,Ts9 Health Magazine,Health Show,ts9india,Latest News Videos,

Post a Comment

0 Comments