క్రికెట్‌లో సెంచరీ చేయడమన్న ప్రతి క్రికెటర్ కల. ఆ సెంచరీ తన జట్టు విజయానికి సాయం చేస్తే ఆ ఆనందం మామూలుగా ఉండదు. కానీ ఒక్కోసారి భారీ సెంచరీ చేసినప్పటికీ తన జట్టును కాపాడుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు ఆ క్రికెటర్‌కి కలిగే బాధ అంతా ఇంతా కాదు. క్రికెట్లోనూ సెంటిమెంట్‌ను బాగా నమ్ముతారు. ఓ క్రికెటర్ సెంచరీ చేస్తే విజయం ఖాయమని, మరొకరు శతకం బాదితే జట్టు ఓడిపోతుందని అభిమానులు నమ్ముతుంటారు. రికార్డుల పరంగానూ ఈ గణాంకాలు నిజమే అని చెబుతుంటాయి. ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ జట్టును మాత్రం ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ఆస్ట్రేలియాలో రోహిత్ నాలుగు సెంచరీలు చేస్తే అన్నింటిలోనూ జట్టు ఓడిపోయింది. ఇప్పుడు మరో మరో దురదృష్టవంతుడి గురించి మనం చెప్పుకుంటున్నాం. అతడే ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ షాన్ మార్ష్.
#Australia
#ShaunMarsh
0 Comments